దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సీతక్క
తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు.
తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీతక్క హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి కోసం నిధులు వెచ్చిస్తున్నామని, దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50కోట్లు కేటాయించిందని ప్రత్యేకంగా జాబ్ పోర్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తు చేసారు.
వికలాంగుల పింఛన్ ను కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా పెంచడం లేదని, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే ఎన్డీయే ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.ప్రత్యేకంగా జాబ్ పోర్టర్‌ను అందుబాటులోకి తెచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. పోలీస్ శాఖలో వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ట్రాఫిక్ విభాగంలో వారి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈనెల 7న ట్రాఫిక్ విభాగంలో వారికి సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేస్తారని చెప్పారు.