Telugu Global
Telangana

రైతుబంధు కోసం రోడ్డెక్కిన రైతులు

సిద్దిపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

రైతుబంధు కోసం రోడ్డెక్కిన రైతులు
X

వానాకాలం పంట సీజన్‌ కు రైతుభరోసా ఇవ్వలేమన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు వ్యాఖ్యలపై సిద్దిపేట రైతులు భగ్గుమన్నారు. జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలోని రహదారిపై శనివారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇన్ని రోజులు రేపు, మాపు రైతు భరోసా వేస్తామని మభ్య పెట్టిన ప్రభుత్వం మొత్తం సీజన్‌ పూర్తయ్యాక ఇవ్వలేము అనడం అన్యాయమని రైతులు అన్నారు. ఏడాదికి ఎకారానికి రూ.15 వేల సాయం చేస్తామని మాట ఇచ్చారని, ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వానాకాలం, యాసంగి రెండు సీజన్‌ ల రైతుభరోసా సాయం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

First Published:  19 Oct 2024 11:04 AM GMT
Next Story