Telugu Global
Telangana

గుడ్‌న్యూస్‌.. రుణమాఫీపై కేటీఆర్‌ కీలక ప్రకటన!

రైతుబంధు కింద అన్న‌దాత‌ల‌ ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.73 వేల కోట్లు జ‌మ చేశామ‌ని, ఇందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పారు.

గుడ్‌న్యూస్‌.. రుణమాఫీపై కేటీఆర్‌ కీలక ప్రకటన!
X

రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలలోపు మిగతా రైతుల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ దేశంలో వరుసగా రెండుసార్లు రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్‌ ప్రభుత్వం మాత్ర‌మేనని చెప్పారు. రైతుబంధు కింద అన్న‌దాత‌ల‌ ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.73 వేల కోట్లు జ‌మ చేశామ‌ని, ఇందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే రేషన్‌ కార్డుదారులంద‌రికీ సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు.

రూ.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కేసీఆర్. అయితే గతంలోనే రూ. 35వేలలోపు ఉన్న రుణాలను మాఫీ చేసిన బీఆర్ఎస్ సర్కార్‌.. మిగతా రుణాలకు సంబంధించిన మాఫీ ప్రక్రియను ఆగస్టు 3న ప్రారంభించింది. రుణమాఫీ ప్రక్రియం మొత్తం పూర్తికాకముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో మిగిలిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

మొత్తం రైతు రుణాలు 19 వేల కోట్ల రూపాయలుగా ఉండగా.. ఇప్పటివరకూ దాదాపు రూ.13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించినట్లు అధికారులు చెప్తున్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే బ్యాంకులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ స్కీం కింద దాదాపు 5 లక్షల 26 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

First Published:  20 Oct 2023 6:58 PM IST
Next Story