మేడారం వెళ్లలేని భక్తులకు గుడ్ న్యూస్
మేడారం మహా జాతర ఈనెల 21 నుంచి 24 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని TSRTC కల్పించింది.
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు TSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. గత జాతర మాదిరిగానే ఈసారి కూడా అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయశాఖతో TSRTC కార్గో విభాగం ఒప్పందం చేసుకుంది. అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను కూడా భక్తులకు అందజేయబోతున్నారు.
ప్రసాదం ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోండిలా..
మేడారం మహా జాతర ఈనెల 21 నుంచి 24 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని TSRTC కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి దగ్గర్లోని కార్గో కౌంటర్లలో మేడారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. పీసీసీ ఏజెంట్స్‌తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించి కూడా ప్రసాదాన్ని బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
ప్రసాదం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండిలా..
https://rb.gy/q5rj68 లింక్‌పై క్లిక్ చేసి లేదా పేటీఎం ఇన్ సైడర్ యాప్‌లోగానీ అమ్మవార్ల ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ చేసే భక్తులు తప్పనిసరిగా సరైన అడ్రస్, పిన్‌కోడ్, ఫోన్ నంబర్ ఇవ్వాలి. మేడారం ప్రసాదం బుకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లకు వెళ్లొచ్చు. లేదా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-69440069, 040-23450033 కి సంప్రదించొచ్చు.