Telugu Global
Telangana

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల పేర్లు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్
X

ఇందిరమ్మ ఇళ్ల పై ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశామని అన్నారు. మొత్తం నాలుగు విడతల్లో ఇళ్లు కేటాయిస్తామన్నారు పొంగులేటి. మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల పేర్లు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ఇళ్లు మహిళ పేరుతోనే మంజురు చేస్తామని ఆయన తెలిపారు. 400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు.

సొంత స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు దశలవారీగా ఇస్తామని పేర్కొన్నారు. నిజమైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అధికారుల సీఎం రేవంత్ హయాంలో జరుగుతోందని.. ఇందులో ఎలాంటి రాజకీయం, రాజకీయ వర్గాలకు తావు లేకుండా, ఏ పార్టీలకు అతీతంగా సంబంధం లేకుండా ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలను ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

First Published:  2 Nov 2024 11:02 AM GMT
Next Story