తెలంగాణలో తహసీల్దార్లకు గుడ్ న్యూస్..! - 81 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
100 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ సర్కారు తహసీల్దార్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 81 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. వారి పేర్లతో ఉన్న జాబితాకు గురువారం ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే 19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వం.. మరో 81 మందికి తాజాగా పదోన్నతులు ఇవ్వడంతో మొత్తం 100 మందికి పదోన్నతులు ఇచ్చినట్లు అయింది.
100 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పదోన్నతులు పొందిన వారిలో ఐదుగురు సచివాలయంలో విధులు నిర్వర్తించే సెక్షన్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. రెవెన్యూ సహా వివిధ శాఖల్లో ఖాళీలకు అనుగుణంగా 81 మందికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.