Telugu Global
Telangana

మొన్న మాటిచ్చారు, నేడు నెరవేర్చారు..

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో మైనార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇటీవలే మైనార్టీబంధు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఇమామ్ లు, మౌజమ్ ల గౌరవ వేతనం పథకంలో లబ్ధిదారులను భారీగా పెంచడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొన్న మాటిచ్చారు, నేడు నెరవేర్చారు..
X

తెలంగాణలో ఇమామ్ లు, మౌజమ్ ల గౌరవ వేతనం పథకంలో లబ్ధిదారుల సంఖ్యను పెంచే విషయంపై ఆదివారం అసెంబ్లీలో మాటిచ్చారు సీఎం కేసీఆర్. గౌరవ వేతనం పొందుతున్న వారి సంఖ్యను పెంచాలంటూ అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం కేసీఆర్ ని కోరారు. ఆయన అభ్యర్థనను మన్నించి లబ్ధిదారుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఆదివారం శాసన సభలో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.

7,005మందికి అదనంగా..

ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 9,995 మంది మౌజమ్ లు, ఇమామ్ లకు గౌరవ వేతనం అందిస్తున్నారు. వారికి అదనంగా ఇప్పుడు 7,005మందిని చేర్చారు. వారి దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల జాబితా తయారు చేశారు. అంటే ఈ పథకం ద్వారా లబ్ధిపొందేవారి సంఖ్య ఇప్పుడు 17వేలకు చేరుకుంది. ఒక్కొకరికి నెలకు 5వేల రూపాయల చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది.

గతంలో ఇమామ్ లు, మౌజమ్ లకు నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందించేవారు. ఆ తర్వాత దాన్ని 1500 రూపాయలకు పెంచారు. తర్వాత 5వేలు చేశారు. ఇప్పుడు వేతనం పెంచకుండా, లబ్ధిదారుల సంఖ్యను పెంచింది ప్రభుత్వం. 17వేలమందికి ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో మైనార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇటీవలే మైనార్టీబంధు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఇమామ్ లు, మౌజమ్ ల గౌరవ వేతనం పథకంలో లబ్ధిదారులను భారీగా పెంచడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  8 Aug 2023 6:18 PM IST
Next Story