Telugu Global
Telangana

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త..

ఈనెల 10 నుంచి మెట్రో వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, రైలు వేళలు పొడిగించామని తెలిపారు.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త..
X

హైదరాబాద్ మెట్రో రైలు ఎంతోమంది ఉద్యోగులకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ట్రాఫిక్ జంజాటం లేకుండా నేరుగా గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. టికెట్ ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. అయితే ఒకే ఒక్క కంప్లయింట్.. రాత్రి పూట ఆలస్యం అయితే మెట్రో ప్రయాణం కష్టం. చివరి ట్రైన్ రాత్రి 10.15 వరకే ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కారం దిశగా కాస్త వెసులుబాటు కల్పించింది మెట్రో యాజమాన్యం. చివరి టెర్మినల్‌లో మెట్రో రైలు చివరి ట్రిప్ రాత్రి 11 గంటలకు మొదలవుతుందని ప్రకటించారు. దీంతో ఉద్యోగులకు కాస్త ఊరట లభించినట్టయింది.

షిఫ్టులవారీ జీవితంలో సెకండ్ షిఫ్ట్ విడిచిపెట్టిన తర్వాత చాలామంది ఉద్యోగులు రాత్రి 10 గంటల తర్వాత ఆఫీస్‌ల నుంచి బయటకు వస్తుంటారు. వారు మెట్రో స్టేషన్లకు వెళ్లే సమయానికి చివరి ట్రైన్ వెళ్లిపోతుంది. అలాంటివారందరికీ ఇక ఆ చింత ఉండదు. ఎంచక్కా సెకండ్ షిఫ్ట్ ముగించుకుని లాస్ట్ ట్రైన్ పట్టుకుని గమ్య స్థానం చేరిపోవచ్చు.

ఈనెల 10 నుంచి..

ఈనెల 10 నుంచి మెట్రో వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, రైలు వేళలు పొడిగించామని తెలిపారు. ఉదయం 6 గంటలకు ఆయా టెర్మినళ్ల నుంచి మెట్రో రైలు ప్రయాణం మొదలవుతుంది. ఆఖరి ట్రైన్ టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత ఇక రైళ్లు ఉండవు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు మాత్రమే ట్రైన్ ఉంటుంది.

First Published:  7 Oct 2022 3:17 PM GMT
Next Story