Telugu Global
Telangana

కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..

దేశంలోనే మెరుగైన విద్యను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు తెచ్చుకుందని చెప్పారాయన. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల పోస్ట్ ల విషయంలో ఉదారంగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..
X

సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయబోతోంది. ఈమేరకు రెండురోజుల్లో ఉత్తర్వులు వస్తాయని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు ఇది నిజంగా శుభవార్త అని అన్నారు. దేశంలోనే మెరుగైన విద్యను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు తెచ్చుకుందని చెప్పారాయన. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల పోస్ట్ ల విషయంలో ఉదారంగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

డీఎస్సీ పోస్ట్ లు 5,089

మరోవైపు డీఎస్సీ పోస్ట్ ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఎస్జీటీ పోస్ట్ లు - 2,575

స్కూల్ అసిస్టెంట్ - 1,739

లాంగ్వేజ్ పండిట్స్ - 611

పీఈటీ పోస్ట్ లు - 164

భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

టెట్ లో క్వాలిఫై అయిన వారంతా ఈసారి టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) రాసేందుకు అర్హులని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. టెట్ లో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీగా జాబితా రూపొందించి డీఎస్సీకి పంపుతారు. ఆ తర్వాత ఆయా జిల్లాల ద్వారా డీఎస్సీ నియామకాలు జరుగుతాయి.


First Published:  25 Aug 2023 4:49 PM IST
Next Story