పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్... తప్పిన పెను ప్రమాదం
రైలు నంబర్ 12727 (విశాఖపట్నం - సికింద్రాబాద్) కోచ్‌లు S1, S2, S3, S4, GS, SLR పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన కోచ్‌లను వేరు చేసి మిగతా కోచ్ లను తీసుకొని ఇంజన్ సికిందరాబాద్ చేరుకుంది. ప్రమాదం జరిగిన ఆరు కోచ్ లలోని ప్రయాణీకులను ఇతర కోచ్ లలో ఎక్కించి పంపించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని బీబీనగర్, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌ల మధ్య అంక్షపూర్ గ్రామ సమీపంలో ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
రైలు నంబర్ 12727 (విశాఖపట్నం - సికింద్రాబాద్) కోచ్‌లు S1, S2, S3, S4, GS, SLR పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన కోచ్‌లను వేరు చేసి మిగతా కోచ్ లను తీసుకొని ఇంజన్ సికిందరాబాద్ చేరుకుంది. ప్రమాదం జరిగిన ఆరు కోచ్ లలోని ప్రయాణీకులను ఇతర కోచ్ లలో ఎక్కించి పంపించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి ఏవైనా విచారణల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక హెల్ప్‌లైన్ 040-27786666ను ఏర్పాటు చేసింది.
రద్దీగా ఉండే మార్గంలో ప్రమాదం జరగడంతో ఇతర రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో సికింద్రాబాద్‌కు వెళ్లే అన్ని రైళ్ళు బీబీనగర్ స్టేషన్‌లో నిలిచిపోయాయి.