హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు 4 స్టార్ రేటింగ్
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధునాతన డిజిటల్ టెక్నాలజీలను అమలు చేయడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపింది.
హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యుత్తమ రేటింగ్ లభించింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ దీనిని ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన ఆడిట్ తర్వాత దీనిని ప్రకటించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) వెల్లడించింది. ప్రపంచంలోని విమానాశ్రయాల నాణ్యతకు స్కైట్రాక్స్ రేటింగ్‌లను ప్రామాణికంగా తీసుకుంటారని ఈ సందర్భంగా తెలిపింది.
విమానాశ్రయం నిర్వహణ, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, పరిశుభ్రత ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని.. స్కైట్రాక్స్ ఈ రేటింగ్‌ను అందిస్తుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) వివరించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధునాతన డిజిటల్ టెక్నాలజీలను అమలు చేయడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపింది. దీని ఫలితమే ఈ రేటింగ్ అని జీహెచ్ఎస్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ పణికర్ వెల్లడించారు.
*