యాదాద్రిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ
కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్లు దిగ్విజయంగా సాగిన గిరి ప్రదక్షిణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం.. స్వాతి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. భక్త జనుల జయజయ నినాదాలు, భక్త సమాజాలు, మహిళల కోలాటలాతో ఈ ప్రదక్షిణ సాగిసింది. వైకుంఠ ద్వారం నుంచి కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్లు దిగ్విజయంగా సాగిన గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. అంతకుముందు దీపాలను వెలిగించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. స్వామివారికి ఆలయ అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్‌రావుతో పాటు ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. మరికొందరు మెట్లెక్కి కొండపైకి చేరుకుని దైవ దర్శనం చేసుకున్నార. భక్తి సమాజాలు, ధార్మిక సంస్థలకు చెందిన భక్తులు ప్రదక్షిణ పాల్గొన్నారు.