Telugu Global
Telangana

కాలనీ రోడ్డులో స్పీడ్ పెంచితే కఠిన చర్యలు

డివైడర్ లేని రోడ్లలో బైక్, కార్ స్పీడ్ 50 కిలో మీటర్లకు తగ్గాల్సిందే. ఇక డివైడర్ లేని రోడ్లలో బైక్, కార్ స్పీడ్ 50 కిలో మీటర్లకు తగ్గాల్సిందే. ఇక కాలనీల్లో స్పీడ్ లిమిట్ గంటకు కేవలం 30 కిలో మీటర్లు మాత్రమే. మాత్రమే.

కాలనీ రోడ్డులో స్పీడ్ పెంచితే కఠిన చర్యలు
X

జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలతో పాటు, నగరాల్లో అంతర్గత రోడ్లపై జరిగే ప్రమాదాల్లో కూడా ప్రాణ నష్టం ఎక్కువే. చిన్న చిన్న ప్రమాదాల్లో ప్రాణాలు పోకపోయినా వైకల్యంతో జీవితాంతం బాధపడాల్సిందే. 90 శాతం ప్రమాదాలకు కారణం ఓవర్ స్పీడ్. హైదరాబాద్‌లో ఇలాంటి ఓవర్ స్పీడ్ ప్రమాదాలను నివారించేందుకు జీహెచ్ఎంసీ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది.

హైదరాబాద్‌లో డివైడర్ ఉన్న ప్రాంతాల్లో కారు లేదా బైక్ స్పీడ్ 60 కిలో మీటర్లకు మించకూడదు. ఆటో, బస్సు అయితే 50 కిలో మీటర్ల గరిష్ట వేగంతో మాత్రమే వెళ్లాలి. డివైడర్ లేని రోడ్లలో బైక్, కార్ స్పీడ్ 50 కిలో మీటర్లకు తగ్గాల్సిందే. ఇక కాలనీల్లో స్పీడ్ లిమిట్ గంటకు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే. నగరంలోని కాలనీల్లో బైక్‌లు, కార్లు అంతకంటే స్పీడ్‌గా వెళ్తే మాత్రం ట్రాఫిక్ చలానా చెల్లించాల్సిందే. ఈ కొత్త నిబంధనలను జీహెచ్ఎంసీ తెరపైకి తెచ్చింది. వీటికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

ఇటీవల కాలంలో కాలనీల్లో వాహనాల అతివేగంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అందులోనూ లింక్ రోడ్లతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గుతోంది. ఖాళీ రోడ్లను చూస్తే ఎవరైనా యాక్సిలరేటర్‌ని రైజ్ చేయకుండా ఉండలేరు. కానీ వారిని కంట్రోల్ చేయడానికి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4,800లకు పైగా కాలనీల్లో ప్రతిచోటా స్పీడ్ కంట్రోల్ బోర్డ్ లు ఏర్పాటు చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటి వరకు 600కు పైగా ఇలాంటి సైన్ బోర్డ్ లు పెట్టారు. త్వరలో అన్ని కాలనీల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఉద్దేశపూర్వకంగా ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నారనే ఫిర్యాదులు వస్తే ట్రాఫిక్ పోలీసులతో నిఘా పెట్టి మరీ చర్యలు తీసుకుంటారు.

First Published:  18 Nov 2022 2:34 PM IST
Next Story