స్కానింగ్ కి 10వేలు, అబార్షన్ కి 30వేలు..
స్కానింగ్ చేయడానికి 10వేలు, ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయడానికి మరో 30వేలు ఇదీ వారి లెక్క. ఇప్పటికే వందలాది అబార్షన్లు గుట్టు చప్పుడు కాకుండా జరిగాయి. చివరకు పోలీసులు, వైద్య శాఖ అధికారులు నిఘా పెట్టడంతో ఆ గుట్టు రట్టయింది.
గర్భవతులకు స్కానింగ్ తీయించాలంటే వెయ్యి రూపాయలనుంచి గరిష్టంగా రూ.1500 ఖర్చవుతుంది. కడుపులో ఉన్నది ఆడ లేదా మగ అనేది చెప్పాలంటే మాత్రం దాని రేటు 10వేలకు పెరుగుతుంది. 10వేలకోసం కక్కుర్తి పడి పుట్టేది ఆడో, మగో చెప్పేస్తుంది ఓ దగుల్బాజీ బ్యాచ్. వరంగల్ లో ఇలా లింగనిర్థారణ చేస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 18మందిని అరెస్ట్ చేశారు.
అబార్షన్ కి మరో రేటు..
స్కానింగ్ చేసినా పుట్టేది ఆడో మగో చెప్పకూడదనేది ప్రభుత్వ నిబంధన. కానీ కొన్నిచోట్ల డాక్టర్లు చెప్పేస్తుంటారు, అది కూడా అబార్షన్ చేయించుకోబోము అనే హామీపైనే. కానీ అబార్షన్ కోసమే ఇలా లింగనిర్థారణ పరీక్షలు చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఆడపిల్ల అని తేలితే వెంటనే ప్రాణం తీసేయడానికి రెడీ అవుతున్నారు కొంతమంది గర్భవతులు. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల బలవంతంతో ఆ పాపం చేయాల్సి వస్తుంది. ఇలాంటి వారి బలహీనతను అడ్డు పెట్టుకుని వరంగల్ కేంద్రంగా ఆ ముఠా వ్యవహారం నడుపుతోంది. స్కానింగ్ చేయడానికి 10వేలు, ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయడానికి మరో 30వేలు ఇదీ వారి లెక్క. ఇప్పటికే వందలాది అబార్షన్లు గుట్టు చప్పుడు కాకుండా జరిగాయి. చివరకు పోలీసులు, వైద్య శాఖ అధికారులు నిఘా పెట్టడంతో ఆ గుట్టు రట్టయింది.
18మందిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరికోసం గాలిస్తున్నామని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. నిందితుల నుంచి లింగనిర్ధారణకు వినియోగించే మూడు స్కానర్లు, రూ. 73 వేల నగదు, 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, జిల్లా వైద్యారోగ్యశాఖ విభాగాలను రంగంలోకి దించి దర్యాప్తు చేయించామని, ‘ఆపరేషన్ దేశాయ్’ ద్వారా అక్రమంగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశామని చెప్పారు. గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్ గా పనిచేసిన వేముల ప్రవీణ్ అనే పాత నేరస్తుడు.. ఆర్ఎంపీలు, పీఎంపీలతో కలసి అబార్షన్ దారుణాలకు పాల్పడ్డాడని తేల్చారు.