Telugu Global
Telangana

గజ్వేల్ నుంచి రాజేందర్.. కోరుట్ల నుంచి అర్వింద్.. నేడు బీజేపీ అధికారిక ప్రకటన

బీజేపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్నారు. ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు.. గజ్వేల్ నుంచి కూడా టికెట్ దక్కించుకున్నారు.

గజ్వేల్ నుంచి రాజేందర్.. కోరుట్ల నుంచి అర్వింద్.. నేడు బీజేపీ అధికారిక ప్రకటన
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 55 మందితో తొలి జాబితాను ఇవ్వాళ అధికారికంగా విడుదల చేయనున్నది. ఇప్పటికే 31 మంది పేర్లను మీడియాకు లీక్ చేశారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం రాత్రి కీలక సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 55 మందితో కూడిన తొలి జాబితాను పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ జాబితాను శనివారం అధికారికంగా విడుదల చేయనున్నారు.

బీజేపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్నారు. ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు.. గజ్వేల్ నుంచి కూడా టికెట్ దక్కించుకున్నారు. సీఎం కేసీఆర్‌పై రాజేందర్‌ను పోటీగా దింపాలని బీజేపీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీల్లో ముగ్గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను కరీంనగర్ అసెంబ్లీ నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును బోథ్ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కోరుట్ల నుంచి పోటీకి నిలపనున్నది.

సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు తిరిగి దుబ్బాక టికెట్ కేటాయించారు. డీకే అరుణను గద్వాల నుంచి, రాణిరుద్రమను సిరిసిల్ల నుంచి పోటీ చేయడానికి కేంద్ర కమిటీ ఓకే చేసింది. మీడియాకు లీక్ అయిన కొన్ని పేర్లు ఇవే..

1. చెన్నూరు (ఎస్సీ) : జి వివేక్

2. ఖానాపూర్ (ఎస్టీ) : రమేశ్ రాథోడ్

3. ఆదిలాబాద్ : పాయల్ శంకర్

4. బోథ్ (ఎస్టీ) : సోయం బాపూరావు

5. నిర్మల్ : మహేశ్వర్ రెడ్డి

6. కోరుట్ల : ధర్మపురి అర్వింద్

7. ధర్మపురి (ఎస్సీ): ఎస్.కుమార్

8. కరీంనగర్ : బండి సంజయ్

9. చొప్పదండి (ఎస్సీ) : బోడిగె శోభ

10. వేములవాడ : చెన్నమనేని వికాస్

11. సిరిసిల్ల : రాణిరుద్రమదేవి

12. హుజూరాబాద్ : ఈటల రాజేందర్

13. గజ్వేల్ : ఈటల రాజేందర్

14. నారాయణ్‌ఖేడ్ : సంగప్ప

15: ఆందోల్ (ఎస్సీ): బాబూమోహన్

16. పటాన్‌చెరు : నందీశ్వర్ గౌడ్

17. దుబ్బాక : రఘునందన్ రావు

18. కుత్బుల్లాపూర్ : కూన శ్రీశైలంగౌడ్

19. ఉప్పల్ : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

20. వికారాబాద్ (ఎస్సీ) : కొప్పు భాషా

21. గద్వాల్ : డీకే అరుణ

22. కల్వకుర్తి : అచారి

23. హుజూర్‌నగర్ : శ్రీలతా రెడ్డి

24. సూర్యాపేట : సంకినేని వెంకటేశ్వర్లు

25. భువనగరి : గూడూరు నారాయణరెడ్డి

26. జనగామ : దుష్యంత్ రెడ్డి

27. స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) : విజయరామారావు

28. మహబూబాబాద్ (ఎస్టీ): హుస్సేన్ నాయక్

29. వరంగల్ (వెస్ట్): రావు పద్మ

30. వరంగల్ (ఈస్ట్): ఎర్రబెల్లి ప్రదీప్ రావు

31. భూపాలపల్లి : కీర్తిరెడ్డి

First Published:  21 Oct 2023 2:37 AM GMT
Next Story