Telugu Global
Telangana

గజ్వేల్ అప్లికేషన్లు.. కాంగ్రెస్-9, బీజేపీ-17

గజ్వేల్ పై ఈసారి కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టరు అనేది కాంగ్రెస్ అంచనా. గజ్వేల్ లో ముదిరాజ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ఈటల అయితే ఖాయంగా బీజేపీదే విజయం అనేది కాషాయదళం ఆశ. అయితే ఈ రెండు పార్టీలు కేసీఆర్ ని తక్కువ అంచనా వేస్తున్నాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

గజ్వేల్ అప్లికేషన్లు.. కాంగ్రెస్-9, బీజేపీ-17
X

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్ స్థానం గజ్వేల్ తో పాటు, కామారెడ్డిలో కూడా పోటీ చేయబోతున్నారు. సో ఆయన ఫోకస్ అంతా ఈసారి ఎక్కువ కామారెడ్డిపైనే ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి. టికెట్ ఆశావహుల మనసులో మాట కూడా అదే. అందుకే గజ్వేల్ టికెట్ కోసం కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ మొదలైంది.

కాంగ్రెస్ నుంచి 9 మంది..

గజ్వేల్ కాంగ్రెస్ టికెట్ కోసం 9 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీటి వడపోత ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి టికెట్ ఖాయం అయ్యే అవకాశాలున్నాయి. కేసీఆర్ కి ముందు నర్సారెడ్డి గజ్వేల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కేసీఆర్ కి పోటీ ఇచ్చిన వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. సో ఇక్కడ తూంకుంటకు పోటీ చేసే ఛాన్స్ దొరికినట్టే.

బీజేపీ నుంచి 17మంది..

గజ్వేల్ నుంచి బీజేపీ టికెట్ కోసం 17 అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఇందులో చాలా వరకు డూప్ షాట్ వ్యవహారాలే. ఈటల రాజేందర్, ఈటల సతీమణి జమున పేరుతో కూడా అప్లికేషన్లు వచ్చినా వాటితో ఆ ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు. కార్యకర్తలే వారి పేర్లతో అప్లికేషన్లు పెట్టారు. సో ఇక్కడ పోటీకి ఈటలను బరిలో దించాలా వద్దా అనేది అధిష్టానం ఇష్టం.

కేసీఆర్ ని తక్కువ అంచనా వేస్తున్నారా..?

గజ్వేల్ పై ఈసారి కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టరు అనేది కాంగ్రెస్ అంచనా. గజ్వేల్ లో బీసీ ఓట్లు అందులోనూ ముదిరాజ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ఈటల అయితే ఖాయంగా బీజేపీదే విజయం అనేది కాషాయదళం ఆశ. అయితే ఈ రెండు పార్టీలు కేసీఆర్ ని తక్కువ అంచనా వేస్తున్నాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ఎప్పుడూ ఓ వర్గం ఓట్లపై ఆశలు పెట్టుకోలేదని, అన్ని వర్గాల సంక్షేమంపై ఆయన దృష్టి పెట్టారని, బీసీలతో సహా అన్ని వర్గాలు ఆయనకే మద్దతు తెలుపుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో మండలాలకు మండలాలే కేసీఆర్ కోసం ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఈ దశలో కేసీఆర్ ని ఢీకొనాలనుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు ఫలించే అవకాశమే లేదని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First Published:  12 Sept 2023 6:30 AM IST
Next Story