Telugu Global
Telangana

గద్దర్ విగ్రహానికి భూమి పూజ.. ఎక్కడంటే..?

ఎంత ఖర్చయినా తానే భరిస్తానని స్థానికులకు చెప్పారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తన సొంత ఖర్చుతోనే విగ్రహం ఏర్పాటు సహా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని మాటిచ్చారు. ఆయన చేతులమీదుగా భూమిపూజ జరిగింది.

గద్దర్ విగ్రహానికి భూమి పూజ.. ఎక్కడంటే..?
X

తెలంగాణలో గద్దర్ తొలి విగ్రహం ఏర్పాటుకి భూమిపూజ జరిగింది. పటాన్ చెరువు బస్టాండ్ సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దీనికోసం పూర్తిగా తన సొంత నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. విరాళాల సేకరణకు ప్రయత్నం చేయొద్దని, ఎంత ఖర్చయినా తానే భరిస్తానని స్థానికులకు చెప్పారు. తన సొంత ఖర్చుతోనే విగ్రహం ఏర్పాటు సహా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని మాటిచ్చారు. ఆయన చేతులమీదుగా భూమిపూజ జరిగింది.

విగ్రహం ప్రత్యేకతలు..

ఎత్తు 11 అడుగులు

ఖర్చు రూ.30లక్షలు

కాంస్య విగ్రహం


గద్దర్ మరణం తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించడంతోపాటు ఘన నివాళులర్పించింది. సీఎం కేసీఆర్ స్వయంగా గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున కూడా విగ్రహం ఏర్పాటు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన అభిమానులు కూడా పలుచోట్ల విగ్రహాల ఏర్పాటుకి ఆసక్తి చూపిస్తున్నారు. గద్దర్ యాదిలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పుడు సొంత ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి, తన నియోజకవర్గంలో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందన్నారాయన.

First Published:  9 Sept 2023 6:06 AM GMT
Next Story