Telugu Global
Telangana

దేశానికి తలమానికంగా ఫ్యూచర్‌ సిటీ

56 గ్రామాలు, 756 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్న భట్టి

దేశానికి తలమానికంగా ఫ్యూచర్‌ సిటీ
X

ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నది. ఫేజ్‌-2 ద్వారా హెచ్‌ఎండీఏలో విస్తరించిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తామని ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. హైదరాబాద్‌ సమగ్ర వరద నీటి పారుదల ప్రాజెక్టుకు రూ. 5,942 కోట్లు కేటాయిస్తామన్నారు. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్‌ సిటీని రూపొందిస్తున్నాం. శ్రీశైలం-నాగార్జున రహదారుల మధ్య ఇది ఉంటుంది. 56 గ్రామాలు, 756 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యూచ్ సిటీలో ఏఐ సిటీ, ఫార్మా హబ్‌, స్పోర్ట్స్‌ సిటీ, క్లీన్‌ ఎనర్జీ, ఇన్నోవేషన్‌ జోన్లు, మల్టీ మోడల్‌ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఉంటాయి. ఈ ప్రాజెక్టును ఎప్‌సీడీఏ పర్యవేక్షిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

First Published:  19 March 2025 1:55 PM IST
Next Story