Telugu Global
Telangana

ప్రభుత్వ విప్‌లుగా నలుగురు MLAలు.. చీఫ్‌ విప్‌ రేసులో ఎవరంటే..?

ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విప్‌లుగా నలుగురు MLAలు.. చీఫ్‌ విప్‌ రేసులో ఎవరంటే..?
X

తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. విప్‌లుగా నియామకమైన వారిలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డోర్నకల్ ఎమ్మెల్యే రామ్‌ చందర్‌ నాయక్ ఉన్నారు. వీరంతా తొలిసారి ఎన్నికైన వారే కావడం గమనార్హం.

ఇక ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఐటీ మినిస్టర్‌గా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రిగా హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ బాధ్యతలు చేపట్టారు.

ఇక ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మల్‌రెడ్డి రంగారెడ్డి, వివేక్ వెంకటస్వామి మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

First Published:  15 Dec 2023 11:30 AM GMT
Next Story