Telugu Global
Telangana

బీజేపీ, కాంగ్రెస్ కి షాక్.. నేడు బీఆర్ఎస్ లోకి ఆ నలుగురు

సీఎం కేసీఆర్ నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఈ చేరికలుంటాయి. ఆ నలుగురు బీఆర్ఎస్ వైపు రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ పార్టీ మరింత బలపడుతుందని అంటున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ కి షాక్.. నేడు బీఆర్ఎస్ లోకి ఆ నలుగురు
X

ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ కి షాకుల మీద షాకులిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అసంతృప్తులను తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా ఆ రెండు పార్టీల నుంచి నలుగురు కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. సీఎం కేసీఆర్ నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఈ చేరికలుంటాయి. ఆ నలుగురు బీఆర్ఎస్ వైపు రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ పార్టీ మరింత బలపడుతుందని అంటున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే. మంత్రి హరీష్ రావు స్వయంగా అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ గులాబి కండువా కప్పుకుంటారు.

ఇక బీజేపీ నుంచి దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ ఇప్పటికే బయటకు వచ్చారు. ఈ రోజు సీఎం కేసీఆర్ సమక్షంలో నర్సపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ లో చేరతారు. నర్సాపూర్‌ టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గాలి అనిల్‌ కుమార్‌ కాంగ్రెస్‌ కి రాజీనామా చేయగా.. సంగారెడ్డిలో దేశ్ పాండేకి టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో బీఫామ్ క్యాన్సిల్ చేయడంతో ఆయన బీజేపీపై అలిగారు. అటు నర్సాపూర్, పటాన్ చెరు నుంచి సింగాయపల్లి గోపి, శ్రీకాంత్ గౌడ్ కి కూడా టికెట్లు లభించలేదు. దీంతో వారంతా అసంతృప్తితో బయటకొచ్చేశారు. బీఆర్ఎస్ లో చేరుతున్నారు.

First Published:  16 Nov 2023 12:13 PM IST
Next Story