నలుగురు బీజేపీ ఎంపీలు రేవంత్‌కు రక్షణ కవచం
రూ. 11 వందల కోట్లతో పూర్తయ్యే మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు? అని ప్రశ్నించిన కేటీఆర్
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పార్టీ మారినా పార్టీకి నష్టం జరగదని, ఆ నియోజకవర్గంలో చాలామంది మూసీ వల్ల బాధపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మూసీ బాదితులను వాపోయారని, వారికి సాయం చేయడానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రూ. 11 వందల కోట్లతో పూర్తయ్యే మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు? ఎవడి కోసం లక్షా యాభై కోట్లు పెడతానంటువో.. దేని కోసం పెడతానంటున్నావో మాకు అర్థమౌతున్నదన్నారు. మూసీమే లూఠో, ఢిల్లీమే బాంటో అని ఆరోపించారు. ఎందుకంటే రేవంత్ బాసులు ఢిల్లీలో ఉన్నారని, వాళ్లకు కోపం వస్తే తుమ్మితే ఊడిపోయే ముక్కు నీది అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊరుకోరని ఆరోపించారు. వాళ్లపైన ప్రియాంక గాంధీ, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారని వాళ్లకు మూటలు పంపాల్సిందేనని అన్నారు.
ఇప్పుడు కొత్తగా బాపూఘాట్ అని కొత్త పల్లవి అందుకున్నారు. రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ విగ్రహం పెడుతానని అనగానే.. మహాత్మాగాంధీ మనమడు తుషార్ గాంధీ స్పందించారు. మహాత్మాగాంధీకి ఇలాంటివి ఇష్టం ఉండదన్నారు. ఆయన అలాంటివేవీ కోరుకోలేదు. వాటిని పేదవాళ్ల కోసం వాడుకోవాలని, విగ్రహం పెట్టవద్దని ఆయన చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. మహాత్ముడిని అడ్డం పెట్టుకుని వెనకాల శిఖండి లాగా రేవంత్ రాజకీయం చేస్తానంటే మంచిది కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ రక్షణ కవచంలా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదని, ఆయన రేవంత్ సహాయ మంత్రి అని సెటైర్ వేశారు. రేవంత్‌రెడ్డికి కష్టం వస్తే ముందు ఆయన మీద రెప్పవాలకుండా రక్షణగా సహాయ మంత్రి కాపాడుకుంటున్నారు. మేము రేవంత్‌రెడ్డిని తిడితే, ఆయనపై విమర్శలు చేస్తే బీజేపీ వాళ్లకు కోపం వస్తున్నది. ఎంపీలు రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్ ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డి రక్షణ కవచం అన్నారు. ఈ నలుగురు ఎంపీలు బీజేపీలో ఉన్నారా? లేక రేవంత్‌కు రక్షణగా ఉన్నారా? అన్నది మీరు ఆలోచించాలన్నారు.
కొడంగల్‌లో పేద వాళ్ల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు? అక్కడి గిరిజనుల మీద దౌర్జ్యం ఎందుకు చేస్తున్నావు? అక్కడి రూ. 60 లక్షల విలువ చేసే భూమిని రూ. 10 లక్షలకే ఎందకు గుంజుకుంటున్నావు? ఇక్కడ ఫార్మా సిటీ రద్దు ఎందుకు అంటున్నావు? అక్కడ ఫార్మా విలేజ్ ముద్దు అని ఎందుకంటున్నావు అని తప్పుల్ని ఎత్తి చూపడం వల్లనే రేవంత్‌రెడ్డికి మేము కంటగింపుగా మారామన్నారు. కేసీఆర్‌ను ఖతం చేస్తానని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను ఖతం చేస్తామన్నవారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోవాలని సూచించారు. రూ. 11 వందల కోట్లతో అయిపోయే మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లు ఎందుకు అంటే రేవంత్‌రెడ్డికి కోపం వస్తున్నది. అందుకే మాపై కేసులు పెట్టి, నిర్బంధం పెట్టి జైలులో వేస్తే మాట్లాడేవారు ఉండరని అనుకుంటున్నారు. కానీ ఇవాళ మీ మణికొండ వారిని చూస్తే మేము జైలుకు వెళ్తే .. మణికొండ నుంచే 10 వేల మంది తయారవుతారని అన్నారు. రేవంత్‌రెడ్డి భరతం పడుతారని హెచ్చరించారు.