Telugu Global
Telangana

ఈ-రేస్ ర‌ద్దు.. రేవంత్‌పై కేటీఆర్ షాకింగ్‌ రియాక్షన్

ఫార్ములా- ఈ కార్ల రేస్ రద్దవడంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పేలవంగా ఉందంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

ఈ-రేస్ ర‌ద్దు.. రేవంత్‌పై కేటీఆర్ షాకింగ్‌ రియాక్షన్
X

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్‌ రద్దయ్యింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈ-ప్రిక్స్ రౌండ్‌ను విరమించుకుంటున్నట్లు ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం నుంచి స్పష్ణమైన నిర్ణయం రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది. గత ప్రభుత్వంతో రేసు నిర్వహణ కోసం అక్టోబర్ 23న చేసుకున్న ఒప్పందాన్ని.. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ శాఖ రద్దు చేసినట్లు తెలిపింది. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖపై చట్టపరమైన చర్యల కోసం నోటీసులు జారీ చేస్తామని FIA చెప్పింది.


ఫార్ములా- ఈ కార్ల రేస్ రద్దవడంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పేలవంగా ఉందంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. ఇదో తిరోగ‌మ‌న నిర్ణయ‌మ‌ని ఫైర్ అయ్యారు కేటీఆర్. "హైద‌రాబాద్ ఈ ప్రీ ఈవెంట్‌తో మ‌న న‌గ‌రానికి బ్రాండ్ ఇమేజ్ వ‌చ్చింది. ప్రపంచ‌వ్యాప్తంగా మ‌న దేశానికి గుర్తింపు వ‌చ్చింది. ఎంతో శ్రమ‌, స‌మ‌యాన్ని కేటాయించి ఫార్ములా ఈ ఈవెంట్‌ను ఇండియాకు తీసుకొచ్చాం. సుస్థిర‌తే ల‌క్ష్యంగా ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించాం. ఎల‌క్ట్రానిక్ వెహికిల్స్ ఔత్సాహికులు, ఉత్పత్తిదారులు, స్టార్టప్‌లు.. పెట్టుబ‌డుల‌కు అనువైన ప్రదేశంగా హైద‌రాబాద్‌ను గుర్తించాయి". కానీ, ఇవాళ రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయం షాక్‌ గురి చేసిందన్నారు కేటీఆర్. ఇది రాష్ట్ర ప్రగ‌తిని అడ్డుకోవ‌డ‌మే అని మండిపడ్డారు.

First Published:  6 Jan 2024 12:59 PM IST
Next Story