Telugu Global
Telangana

ఎయిర్‌పోర్టులో కేంద్ర మాజీ మంత్రి కుమార్తె అరెస్టు.. అస‌లేం జ‌రిగింది?

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి పీటీ వారెంట్‌పై శ్రీవాణిని మహారాష్ట్రకు తరలించారు.

ఎయిర్‌పోర్టులో కేంద్ర మాజీ మంత్రి కుమార్తె అరెస్టు.. అస‌లేం జ‌రిగింది?
X

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీ‌వాణిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. మ‌హారాష్ట్రలో ఆమెపై ఓ చీటింగ్ కేసు న‌మోదు కావ‌డంతో అప్ప‌టి నుంచి ఆమె ప‌రారీలో ఉన్నారంటూ ఆ రాష్ట్ర పోలీసులు లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. గురువారం రాత్రి శ్రీ‌వాణి దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావ‌డంతో పోలీసులు మ‌హారాష్ట్ర పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు వ‌చ్చి ఆమెను అరెస్టు చేశారు.

పీటీ వారెంట్‌తో జైపూర్‌కు త‌రలింపు

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి పీటీ వారెంట్‌పై శ్రీవాణిని మహారాష్ట్రకు తరలించారు. చీటింగ్ కేసులో ఆమె నిందితురాల‌ని పోలీసులు చెబుతుంటే.. తాను ఎలాంటి నేరం చేయ‌లేద‌ని శ్రీ‌వాణి వాదిస్తున్నారు. త‌న తండ్రికి చెందిన‌ ప్రోగ్రెసివ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీ వ్య‌వ‌హారాల నుంచీ తాను త‌ప్పుకున్నాన‌ని, అయినా కావాల‌నే త‌న‌ను కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నార‌ని వాపోయారు.

వెయ్యి కోట్ల రుణాల ఎగ‌వేత ఆరోప‌ణ‌లు

శ్రీ‌వాణి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించలేదని భారీగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. మొత్తం 18 బ్యాంకుల నుంచి రూ.1000 కోట్ల రుణాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. 2015లో ఆయా బ్యాంకుల సిబ్బంది శ్రీవాణికి చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగి మౌన‌దీక్ష కూడా చేశారు.

First Published:  14 Oct 2023 12:24 PM IST
Next Story