Telugu Global
Telangana

ఛాలెంజ్ చేస్తున్నా.. ఏనాడూ ఎవరినీ సిఫార్సు చేయలే..

ప్రచారంపై స్పందించిన వినోద్‌ కుమార్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ఒకే ఇంటి పేరు ఉన్నంత మాత్రానా బంధువులు అవుతారా అంటూ ప్రశ్నించారు.

ఛాలెంజ్ చేస్తున్నా.. ఏనాడూ ఎవరినీ సిఫార్సు చేయలే..
X

తన అన్న బిడ్డ సరితకు జెన్‌కో లో అర్హత లేకున్నా సీఎండీ ప్రభాకర్‌ రావు ఉద్యోగం ఇచ్చారన్న ఆరోపణలను ఖండించారు మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌. అసలు తనకు అన్నే లేడన్న వినోద్‌ కుమార్‌.. సరితకు తనకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు. క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. లోక్‌సభ ఎన్నికలు వస్తుండటంతోనే తనపై చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు వినోద్‌ కుమార్‌.

తన రాజకీయ జీవితంలో ఏనాడైనా చట్ట వ్యతిరేకంగా రికమెండ్ చేసినట్లు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. అలాంటి పనులు తానూ ఏనాడూ చేయలేదన్నారు. అది తన న్యాయవాద వృత్తి తనకు నేర్పిందన్నారు. హక్కుల విషయంలో సొంత ప్రభుత్వంపైనే కొట్లాడనని గుర్తుచేసుకున్నారు వినోద్ కుమార్‌. అక్రమంగా, అన్యాయంగా ఎవరిని ఏనాడూ రికమెండ్ చేయలేదు, చేయబోనన్నారు.


తెలంగాణ జెన్‌కో సంస్థలో బోయినపల్లి సరిత అనే మహిళను అసిస్టెంట్ ఇంజినీర్‌గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఆమెను అసిస్టెంట్ ఇంజినీర్‌గా నియమించారని.. ఆమె ఏనాడూ ఆఫీసుకు రాకపోయినా జీతాలు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. సరిత వినోద్‌కుమార్‌ అన్న బిడ్డ అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన వినోద్‌ కుమార్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ఒకే ఇంటి పేరు ఉన్నంత మాత్రానా బంధువులు అవుతారా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ తన కార్యకర్తలపై దుష్ప్రచారం చేయిస్తున్నారని వినోద్ మండిపడ్డారు.

First Published:  7 Jan 2024 1:23 PM IST
Next Story