సొంతగూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆత్రం సక్కు మళ్లీ సొంతగూటికి చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2024లో బీజేపీ గోడం నగేశ్‌కు టిక్కెట్ ఇచ్చింది. ఆయన అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన హస్తం పార్టీలో చేరారు. గాంధీ భవన్‌లో వారు కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆత్రం సక్కు 2009, 2019లో ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే ఈ రెండు పర్యాయాలు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితున్ని అయ్య. అన్ని మతాలకు నేను గౌరవిస్తా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కు కట్టుబడి పని చేస్తాని సోయం బాపు రావు అని తెలిపారు. ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. మా మీద విమర్శలు చేసే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. మంచి ముహూర్తం చూసుకొని వారు కూడా మా కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని పీసీసీ చీఫ్ తెలిపారు