మీరు ఇటుకలతో కొడితే.. మేం రాళ్లతో కొడతాం
ఎన్నికలకు ముందు అందరికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కొందరికే అంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్‌కి 30 సీట్లు కూడా రాకపోయేవన్నారు.
రేవంత్ సర్కారు లోటుపాట్లపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు కేటీఆర్. కొద్ది రోజులు భరిస్తామని, తర్వాత మీరు ఇటుకలతో కొడితే మేం రాళ్లతో కొడతామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు అందరికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కొందరికే అంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్‌కి 30 సీట్లు కూడా రాకపోయేవన్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా.. లంకె బిందెల దొంగలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీమంత్రి హరీశ్‌రావు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా ఆర్టీసీ విలీనానికి సంబంధించి అపాయింట్‌మెంట్ డే ప్రకటించలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డే అమలు చేయాలన్నారు. ప్రభుత్వంతో విలీనం చేస్తూ తక్షణం జీవో విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు సర్వీసులతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై భారం పడుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు. 2013 పీఆర్సీ బాండ్స్‌కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని.. బాండ్స్‌కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలన్నారు హరీశ్‌రావు.