ఒక్కరికి రైతు భరోసా ఇచ్చినా.. ముక్కు నేలకు రాస్తా..
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై స్పందించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్‌రెడ్డి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చినా ముక్కు నేలకు రాసి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమన్నారు.
తెలంగాణ రాజకీయమంతా రైతుల చుట్టే తిరుగుతోంది. రుణమాఫీ, పంట పెట్టుబడి సాయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే తమ ప్రభుత్వం 65 లక్షల మందికి రైతు భరోసా చెల్లించిందని.. ఈనెల 8లోగా మిగిలిన బకాయిలు చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 9లోగా ఒక్క రైతుకు బకాయి ఉన్నా అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తా అన్నారు. రైతు భరోసా నిధులు అందితే.. కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా అని రేవంత్ సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2024
నువ్వు ఒక్కరికైనా రైతు భరోసా ఇచ్చి ఉంటే నేను ముక్కు నేలకు రాసి.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నువ్వు కేసీఆర్ మొదల పెట్టిన రైతు బంధు మంత్రమే కొనసాగించావు.
5 నెలల నుండి కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును కూడా ఇవ్వకుండా… pic.twitter.com/Nzh6Kv7eN7
ముక్కు నేలకు రాయాల్సింది నువ్వు..!
ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై స్పందించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్‌రెడ్డి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చినా ముక్కు నేలకు రాసి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమన్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన రైతుబంధును మాత్రమే రేవంత్ కొనసాగించిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధును కూడా సరిగ్గా ఇవ్వకుండా.. 5 నెలల నుంచి రైతులని ఇబ్బంది పెట్టి, అప్పుల పాలు చేసినందుకు రేవంతే ముక్కు నేలకు రాసి మరీ రైతుబంధు ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.