Telugu Global
Telangana

రైతులపై లాఠీఛార్జి.. రేవంత్‌పై హరీష్‌ ఫైర్‌

కాంగ్రెస్‌ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని.. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు హరీష్ రావు. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు హరీష్ రావు.

రైతులపై లాఠీఛార్జి.. రేవంత్‌పై హరీష్‌ ఫైర్‌
X

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రైతులపై లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులపై లాఠీఛార్జి అత్యంత బాధాకరమని ట్వీట్ చేశారు. సాగునీరు, కరెంటుతో పాటు విత్తనాలు కూడా అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్‌ తెస్తానన్న మార్పు ఇదేనా.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని.. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు హరీష్ రావు. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు హరీష్ రావు. ఇందుకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు హరీష్ రావు.


ఖరీఫ్ సీజన్‌ సమీపిస్తుండడంతో తెలంగాణలో రైతులు విత్తనాల కోసం షాపుల ముందు క్యూ కడుతున్నారు. చాలా జిల్లాల్లో పచ్చి రొట్ట, జిలుగు విత్తనాల కొరత ఏర్పడింది. జిలుగు విత్తనాల డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి విత్తనాల కొరత ఏర్పడింది.

First Published:  28 May 2024 2:25 PM IST
Next Story