Telugu Global
Telangana

రేవంత్ అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మళ్లీ రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్‌ అంటే కరవు, కరెంటు కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అంటూ విమర్శించారు హరీష్.

రేవంత్ అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు
X

సీఎం రేవంత్‌ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్‌ రావు. నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్లు.. ఓటేయకపోతే పథకాలు బంద్‌ అవుతాయని రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్‌ అంటే కరెంటు కోతలు అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటివరకూ రైతు బంధే ఇవ్వలేదు కానీ, రైతు రుణమాఫీ చేస్తానంటున్నాడంటూ ఎద్దేవా చేశారు హరీష్‌.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మళ్లీ రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్‌ అంటే కరవు, కరెంటు కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అంటూ విమర్శించారు హరీష్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం, కళ్యాణలక్ష్మి, తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ని ఓడించాలని ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి వంద కారణాలున్నాయన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్‌కు భస్మాసుర హస్తంగా మారుతాయన్నారు హరీష్‌. ఆగస్టు 15 లోగా రూ. 39 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా..? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్ విసిరారు హరీష్‌.

First Published:  22 April 2024 5:20 PM GMT
Next Story