కడియం బిడ్డను ఓడించే బాధ్యత నాది - ఎర్రబెల్లి
కడియం కూతురుకి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని తాను ముందుగానే చెప్పానన్నారు ఎర్రబెల్లి. కావ్యకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ థర్డ్ ప్లేసులో ఉంటుందని హెచ్చరించానన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దందాలు చేసే వాళ్లు, బ్రోకర్లే పార్టీలు మారతారని ఫైర్ అయ్యారు. వరంగల్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి.. కార్యకర్తలు అధైర్య పడొద్దని, వాళ్లను కాపాడుకునే బాధ్యత మాపై ఉందని భరోసా కల్పించారు.
కడియం కూతురుకి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని తాను ముందుగానే చెప్పానన్నారు ఎర్రబెల్లి. కావ్యకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ థర్డ్ ప్లేసులో ఉంటుందని హెచ్చరించానన్నారు. కానీ, హరీష్ రావు కలగజేసుకుని కడియం పార్టీ మారేలా ఉన్నాడని.. కావ్యకు టికెట్ ఇప్పించారన్నారు ఎర్రబెల్లి. అయినప్పటికీ పార్టీ మారారని కడియం తీరును తప్పుపట్టారు ఎర్రబెల్లి. కడియం శ్రీహరి బిడ్డను ఓడగొట్టాలనే కసి వరంగల్ బీఆర్ఎస్ కార్యకర్తల్లో పెరిగిందన్నారు.
కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి ఎన్టీఆర్కు ఇష్టం లేకపోయినా బ్రతిమిలాడి ఇప్పించినా
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2024
ఇప్పుడు కడియం శ్రీహరిని ఓడించే దాంట్లో కూడా మొదట నేనే ఉంటా - ఎర్రబెల్లి దయాకర్ రావు. pic.twitter.com/4iqeVCFdsW
ఆనాడూ టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తే తానే ఇప్పించానన్నారు ఎర్రబెల్లి. ఇక వరంగల్ నుంచి కుల సమీకరణాల్లో నాకు మంత్రి పదవి ఇవ్వలేనని ఎన్టీఆర్ ఆనాడు చెబితే.. ముందుండి కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇప్పించానని గుర్తు చేసుకున్నారు ఎర్రబెల్లి. ఇప్పుడు కడియం కావ్యను ఓడించేందుకు కూడా తాను ముందుంటానన్నారు ఎర్రబెల్లి.