Telugu Global
Telangana

బీఆర్ఎస్‌కు రాజయ్య గుడ్‌బై.. ఆ టికెట్‌ హామీతో కాంగ్రెస్‌లోకి..?

తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పని చేశారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి తప్పించారు

బీఆర్ఎస్‌కు రాజయ్య గుడ్‌బై.. ఆ టికెట్‌ హామీతో కాంగ్రెస్‌లోకి..?
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వగా.. ఆయన విజయం సాధించారు. అయితే ఆ సమయంలో రాజయ్యకు వరంగల్ లోక్‌సభ టికెట్‌ ఇస్తామని పార్టీ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. తర్వాత హైకమాండ్‌ నుంచి సరైన స్పందన లేకపోవడంతో రాజయ్య పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పని చేశారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇక 2018లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది.

రాజయ్య మళ్లీ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరతారని సమాచారం. ఆయనకు కాంగ్రెస్‌ నుంచి వరంగల్‌ లోక్‌సభ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. వరంగల్ టికెట్ హామీతో ఈనెల 10న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.

First Published:  3 Feb 2024 5:34 AM GMT
Next Story