Telugu Global
Telangana

మెదక్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్..!

2019 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

మెదక్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్..!
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సిట్టింగ్‌లను మార్చడం సహా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న మెదక్‌ బరిలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా మెదక్ నుంచి పోటీ చేసి లోక్‌సభకు వెళ్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా మెదక్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డిని మెదక్‌ స్థానం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. వెంకట్రామిరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వెంటనే గవర్నర్ కోటాలో వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కేసీఆర్. వెంకట్రామిరెడ్డిది ప్రస్తుత పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. మెదక్‌ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు, కాంగ్రెస్ నుంచి విజయశాంతి పోటీ చేయడం దాదాపు ఖాయమైన‌ట్లుగా తెలుస్తోంది.

First Published:  23 Jan 2024 11:25 AM IST
Next Story