కడియంకు శాశ్వత రాజకీయ సమాధి - కేసీఆర్
కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశామన్నారు కేసీఆర్. కడియంకు టికట్ ఇచ్చామని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించామన్నారు.
BY Telugu Global29 April 2024 8:20 AM IST

X
Telugu Global Updated On: 29 April 2024 8:20 AM IST
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం వరంగల్‌లో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్.. కడియంను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశామన్నారు కేసీఆర్. కడియంకు టికట్ ఇచ్చామని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించామన్నారు. ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో చెప్పాలన్నారు కేసీఆర్. తన రాజకీయ జీవితానికి కడియం శ్రీహరి శాశ్వత సమాధి నిర్మించుకున్నారన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరో మూడు నెలల్లో ఉపఎన్నిక రావడం ఖాయమన్నారు కేసీఆర్. తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదన్నారు. ద్రోహులకు గుణపాఠం అదే అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్.
Next Story