నరేందర్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి కోరిన పోలీసులు
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతానంటూ శపథం చేశారు
BY Vamshi Kotas20 Nov 2024 3:22 PM IST
X
Vamshi Kotas Updated On: 20 Nov 2024 4:19 PM IST
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. లగచర్ల దాడి ఘటనలో నరేందర్‌రెడ్డి పోలీసు కస్టడీ పిటిషన్‌పై కొడంగల్ కోర్టులో విచారణ జరిగింది. నరేందర్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా విచారణకు ఈ నెల 22కు వాయిదా వేసింది. కొడంగల్ కోర్టు ఆవరణలో నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతానంటూ పట్నం శపథం చేశారు. రైతులకు మద్దతిస్తే నా మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా అంటూ ఆగ్రహించారు. పోలీసు, ఇంటెలిజెన్స్, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేసేందుకు నా మీద కేసులు పెట్టిండు. ఈ కేసు కుట్రలో భాగమే. న్యాయస్థానాల మీద గౌరవం, విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా నేను బయటకు వస్తాను అని పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story