దమ్ముంటే రాజీనామా..! తెలంగాణలో ఫ్లెక్సీ వార్
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ తన మాట నిలబెట్టుకుందని ఆ పార్టీ నేతలంటున్నారు. కాదు కాదు రుణమాఫీ ఈ దేశ చరిత్రలోనే రైతుల విషయంలో జరిగిన అతి పెద్ద మోసం అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియా వార్ కూడా పెద్ద స్థాయిలోనే నడుస్తోంది. ఇవి కాదన్నట్టు తాజాగా ఫ్లెక్సీ వార్ మొదలైంది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభిమానులు పోటాపోటీగా ఫ్లెక్సీలు వేస్తున్నారు. నువ్ రాజీనామా చెయ్..! అని ఒకరు ఫ్లెక్సీ వేస్తే, దమ్ముంటే నువ్ చెయ్..! అంటూ మరొకరు రెచ్చగొట్టేలా బ్యానర్లు వేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు మరింత ముదరడంతో కార్పొరేషన్ అధికారులు తలపట్టుకున్నారు. వాటిని వెంటనే తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ తన మాట నిలబెట్టుకుందని ఆ పార్టీ నేతలంటున్నారు. కాదు కాదు రుణమాఫీ ఈ దేశ చరిత్రలోనే రైతుల విషయంలో జరిగిన అతి పెద్ద మోసం అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తానంటూ గతంలో హరీష్ రావు సవాల్ విసిరారని, ఆ సవాల్ కి కట్టుబడి ఆయన రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు వేశారు. సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు కనపడ్డాయి.
'దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు' అని రాసి ఉన్న ఫ్లెక్సీ లను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.. #Flexi #Politics #Hyderabad #Telangana @INCTelangana… https://t.co/D4uSRZjGB4 pic.twitter.com/m0JNjjUl7c
— Telangana Awaaz (@telanganaawaaz) August 16, 2024
ఇప్పుడు రేవంత్ వంతు..
తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా హైదరాబాద్ బస్టాండ్స్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ పై కాంగ్రెస్ మాట తప్పిందని, సీఎం రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వేశారు. హోర్డింగ్స్ పెట్టారు. రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం అనే వ్యాఖ్యలు ఈ ఫ్లెక్సీల్లో ఉన్నాయి. రూ.31 వేల కోట్లు అని చెప్పి రూ.17 వేల కోట్ల మాఫితో సరిపెట్టారని సీఎంపై విమర్శలు సంధిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. వీటిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
నగరంలో ఫ్లెక్సీ కలకలం
— Telangana Awaaz (@telanganaawaaz) August 17, 2024
నిన్న హరీష్ రావు - నేడు రేవంత్ రెడ్డి
రుణమాఫీ పై కాంగ్రెస్ మాట తప్పింది అంటూ హైద్రాబాద్ బస్ స్టాండ్స్ లో వెలిసిన ఫ్లెక్సీలు ,పోస్టర్లు
సీఎం రాజీనామా చేయాలంటూ వెలిసిన పోస్టర్లు, హార్డింగ్స్ విషయం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో తెగ వైరల్… https://t.co/JmwAsTFIiy pic.twitter.com/zEmCIcWfRs