Telugu Global
Telangana

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న మెకానిక్ షెడ్డులో చెలరేగిన మంటలు.. దాదాపు నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి. కారు రిపేర్ చేస్తుండగా డీజిల్ డబ్బాలకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి
X

హైదరాబాద్‌ నాంపల్లి బజార్‌ఘాట్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. కొందరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం కాగా.. మరికొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న మెకానిక్ షెడ్డులో చెలరేగిన మంటలు.. దాదాపు నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి. కారు రిపేర్ చేస్తుండగా డీజిల్ డబ్బాలకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 9.30 గంట‌ల‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మ‌ర‌ణించ‌గా, మరో 15 మందిని డీఆర్ఎఫ్‌, రెస్క్యూ సిబ్బంది రక్షించారు.

ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటల ధాటికి సమీపంలోని వాహనాలు కాలిపోయాయి.

First Published:  13 Nov 2023 11:15 AM IST
Next Story