నామినేషన్ దాఖలు చేసిన ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ తన నామినేషన్ దాఖలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ తన నామినేషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో ఆయన వెంట బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.దీంతో శాసన సభ ప్రాంగణం మొత్తం ఒక్కసారి కోలాహలంగా మారిపోయింది. మరోవైపు ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
మరోవైపు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యేలో ఒక్కో అభ్యర్థికి విజయానికి 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది గెలవగా.. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీకి రెండో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేకపోయింది. అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లను గెలుచుకుంది.