సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.
సికిందరాబాద్ లో రూబీ హోటల్ జరిగిన అగ్నిప్రమాదం మర్చిపోకముందే సికిందరాబాద్ లోనే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8వ అంతస్తుల్లో భారీగా మంటలు చెలరేగాయి.అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.
దాదాపు నాలుగు గంటల ఆపరేషన్ తర్వాత పూర్తిగా అగ్నిని అదుపులోకి తీసుకవచ్చారు. ఈప్రమాదంలోంచి 15 మందిని రక్షించారు. అప్పటికే అందులో 6గురి పరిస్థితి విషమంగా ఉండి, వారంతా స్పృహ కోల్పోయిన స్థితిలో ఉండగా రెస్క్యూ సిబ్బంది గుర్తించి వారిని రక్షించారు. క్యూ నెట్ అనే సంస్థలో పని చేస్తున్న వెన్నెల, శ్రియ, ప్రమీల, త్రివేణి, శివ, ప్రసాద్ అనే ఆ ఆరుగురిని దగ్గరలోని ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు మరణించడంతో పోస్టు మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
కాగా కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం వల్ల కరెంట్ పోవడంతో పూర్తిగా చీకటి గా ఉంది. కాబట్టి బిల్డింగ్ లో మరెవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అనేది తెలియడం లేదని ఫైర్ అధికారులు చెప్తున్నారు. కాగా, హోం మంత్రి మహమూద్ అలీ, టూరిజం మంత్రి శ్రీనివాస యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఫైర్ ఆక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు,