Telugu Global
Telangana

6 డిమాండ్లతో రేవంత్‌కు నిరుద్యోగుల మొదటి వార్నింగ్

హలో నిరుద్యోగి - చలో ఇందిరా పార్క్ పేరిట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వేలాది మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. రేవంత్ సర్కారు ముందు 6 డిమాండ్లను ఉంచారు.

6 డిమాండ్లతో రేవంత్‌కు నిరుద్యోగుల మొదటి వార్నింగ్
X

ధర్నాచౌక్‌ వేదికగా రేవంత్‌ సర్కారుకు మొదటి వార్నింగ్ ఇచ్చారు నిరుద్యోగులు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా, నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహించారు. హలో నిరుద్యోగి - చలో ఇందిరా పార్క్ పేరిట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వేలాది మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. రేవంత్ సర్కారు ముందు 6 డిమాండ్లను ఉంచారు.

6 డిమాండ్లు..

1. గ్రూప్‌-2లో 2వేల పోస్టులు పెంచాలి

2. గ్రూప్‌-3లో 3వేల పోస్టులు పెంచాలి

3. గ్రూప్‌-1 మెయిన్స్‌లో 1:100 ప్రకారం అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి

4. మెగా డీఎస్సీ ప్రకటించాలి

5. జీవో నంబర్‌ 46ను రద్దు చేయాలి

6. గురుకులాల్లోని బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

నిరుద్యోగ సంఘాల జేఏసీ, అశోక్‌ చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్‌ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించింది. BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా ఇతర నేతలు ధర్నాలో పాల్గొన్నారు. గ్రూప్‌-2, 3 పోస్టులను పెంచాలని, జీవో 46 బాధిత అభ్యర్థులకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

First Published:  20 Jun 2024 2:48 PM IST
Next Story