Telugu Global
Telangana

చిట్యాలలోని ఓ కంపెనీలో రియాక్టర్ల పేలుడు... పలువురు కార్మికులు మృతి !

నల్గొండ జిల్లా చిట్యాలలోని హెండీస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలిపోవడంతో పలువురు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో 70 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం.

చిట్యాలలోని ఓ కంపెనీలో రియాక్టర్ల పేలుడు... పలువురు కార్మికులు మృతి !
X

న‌ల్ల‌గొండ జిల్లా చిట్యాలలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. చిట్యాల మండ‌లం వెలిమినేడులోని హెండీస్ ఫార్మా కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధ‌వారం సాయంత్రం ఈ కంపెనీలో రియాక్టర్లు పేలిపోయాయి. ఆ సమయంలో ఆ రియాక్టర్ల‌ వద్ద 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం. మొత్తం ఫ్యాక్టరీలో 70 మంది పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు అక్కడిక్కడే మృతి చెంద‌గా.. అనేక మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అయితే 6గురు కార్మికులుమృతి చెందినట్టు స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికీ ఫ్యాక్టరీలో భారీగా మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంట‌లు ఎగిసి ప‌డుతుండ‌టంతో.. స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రియాక్టర్లు పేలిన శబ్ధానికి ఫ్యాక్టరీలోని కార్మికులే కాక చుట్తుపక్కల ప్రజలు కూడా పరుగులు తీశారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

First Published:  24 Aug 2022 6:47 PM IST
Next Story