Telugu Global
Telangana

తెలంగాణలో నేటి నుంచి మైనార్టీ బంధు

ఎక్కడా ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా.. మైనార్టీల్లోని పేదలందరికీ ఈ ఆర్థిక సాయం అందాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆయన ఆదేశాల మేరకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక మొదలైంది. నేటినుంచి ఈ పథకం అమలులోకి వస్తోంది.

తెలంగాణలో నేటి నుంచి మైనార్టీ బంధు
X

దళిత బంధు లాగే వివిధ సామాజిక వర్గాలకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని నియోజకవర్గాల వారీగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మైనార్టీ బంధుకి వేళయింది. ఈరోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా మైనార్టీల ఆర్థిక సాయం పంపిణీ మొదలు కాబోతోంది.

సాయం ఎంతంటే..?

మైనార్టీలకు కూడా బీసీల లాగే లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. మైనార్టీ యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయం చేస్తుందని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి లక్ష రూపాయల ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించబోతున్నట్టు వెల్లడించింది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో లాంఛనంగా ఈ కార్యక్రమం మొదలవుతుంది.

నియోజకవర్గాల వారీగా..

ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేశారు. వారికి చెక్కులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో లాంఛనంగా చెక్కుల పంపిణీ మొదలైన తర్వాత .. జిల్లా కేంద్రాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ ప్రారంభమవుతుంది. ఎక్కడా ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా.. మైనార్టీల్లోని పేదలందరికీ ఈ ఆర్థిక సాయం అందాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆయన ఆదేశాల మేరకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక మొదలైంది. నేటినుంచి ఈ పథకం అమలులోకి వస్తోంది.

First Published:  19 Aug 2023 7:10 AM IST
Next Story