Telugu Global
Telangana

ఎట్టకేలకు టెట్‌ దరఖాస్తు ప్రక్రియ షురూ

ఈసారి పరీక్ష ఫీజు తగ్గింపు.. మేలో క్వాలిఫై కాని వారు, స్కోర్‌ పెంచుకోవాలనుకునేవారికి ఫీజు మినహాయింపు

ఎట్టకేలకు టెట్‌ దరఖాస్తు ప్రక్రియ షురూ
X

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు ప్రక్రియ ఎట్టకేలకు గురువారం రాత్రి సుమారు 11 గంటలకు ప్రారంభమైంది. మొదట ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్నికల్‌ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే 7వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. దాంతో గురువారం ఉదయం నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌ లింక్‌ ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారా అని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. మొత్తానికి రాత్రి పది గంటలకు ఆన్‌లైన్‌ లింక్‌ను, ఇన్ఫర్మేషన్‌ బులెటెన్‌ను వెబ్‌సైట్‌లో పెట్టారు. టెట్‌ పరీక్ష ఫీజును ఈసారి తగ్గించారు. గతంలో ఇది ఒక పేపర్‌కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 2000గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ. 750, రూ.1000 నిర్ణయించారు. మొన్న మే నెలలో టెట్‌ రాసి క్వాలిఫై కాని వారు, ఒకవేళ అర్హత సాధించినా స్కోర్‌ పెంచుకోవడానికి మళ్లీ పరీక్ష రాసి వారికి ఎటువంటి ఫీజు ఉండదు. ఫిబ్రవరి 5న టెట్‌ ఫలితాలను ప్రకటించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

First Published:  8 Nov 2024 3:07 AM GMT
Next Story