ఎంపీ బరిలో దిల్‌రాజు.. ఆపార్టీ నుంచే పోటీ!
సక్సెస్ ఫుల్ సినీ నిర్మాతగా, సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న దిల్‌రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో దిల్ రాజును పోటీలో ఉంచాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు ఆయన ఒప్పుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోనే ఉండటంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సక్సెస్ ఫుల్ సినీ నిర్మాతగా, సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న దిల్‌రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన పొలిటికల్ ఎంట్రీపై కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలతో ఈయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే దానిపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్ నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని దిల్ రాజు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు సీనియర్లు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇదే నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. షబ్బీర్ అలీ ఇటీవల నిజామాబాద్ అర్బన్ నుంచి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీకి తెరలేపబోతోందా..? అన్న చర్చ మొదలైంది.