Telugu Global
Telangana

పబ్‌లో గొడవ.. గౌతమ్ సవాంగ్ కుమారుడికి గాయాలు

ఒక అమ్మాయి విషయంలో పబ్‌లో వీరి మధ్య గొడవ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ప‌బ్‌లో గొడ‌వ ప‌డిన అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కూడా మరోసారి ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. రోడ్డు మీద ప‌డి కొట్టుకున్నారు.

పబ్‌లో గొడవ.. గౌతమ్ సవాంగ్ కుమారుడికి గాయాలు
X

హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ రోడ్డు నంబర్‌.10లోని ఒక పబ్‌లో గొడవ జరిగింది. బుధవారం రాత్రి బాగా తాగేసి రెండు వర్గాలు పబ్‌ బయట రోడ్డు మీద కొట్టుకున్నాయి. ఒక గ్రూప్‌లో మాజీ డీజీపీ, ప్రస్తుతం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కుమారుడు సైతం ఉన్నాడు. రెండు గ్రూపుల ఘ‌ర్ష‌ణ‌లో అతడికి గాయాలయ్యాయి. మరో గ్రూప్‌లోని సిద్ధార్థ్‌ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

ఒక అమ్మాయి విషయంలో పబ్‌లో వీరి మధ్య గొడవ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ప‌బ్‌లో గొడ‌వ ప‌డిన అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కూడా మరోసారి ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. రోడ్డు మీద ప‌డి కొట్టుకున్నారు. గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్‌ గాయపడ్డాడు. పోలీసులు వెళ్లే సరికి అందరూ పారిపోయారు. ఉదయం డేవిడ్ సవాంగ్‌.. సిద్ధార్థ్‌ గ్రూపుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సిద్ధార్థ్‌ వర్గం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇరువర్గాల్లోని వారు బాగా ఉన్నవారి పిల్లలే. తప్పు ఎవరిది అన్న దానిపై పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

First Published:  14 Sept 2023 11:01 AM IST
Next Story