గన్‌పార్క్ చుట్టూ కంచెలు.. రేవంత్ సర్కార్‌పై విమర్శలు
ఇవాళ సాయంత్రం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ గన్‌పార్క్ నుంచి ట్యాంక్‌బండ్ మీద ఉన్న అమరజ్యోతి వరకు తెలంగాణ అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేసింది
కంచెలు తొలగించాం.. మాది ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ సర్కార్ గన్ పార్క్ చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ గన్‌పార్క్ చుట్టూ భారీ కంచెలు నిర్మించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
మరోవైపు ఇవాళ సాయంత్రం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ గన్‌పార్క్ నుంచి ట్యాంక్‌బండ్ మీద ఉన్న అమరజ్యోతి వరకు తెలంగాణ అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరుకానున్నారు. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనుంది బీఆర్ఎస్.
Telugu Scribe Exclusive Visuals
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2024
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు!
అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు బిగిస్తోంది. pic.twitter.com/ZxHuUf7n3h
అయితే ఈ ర్యాలీ కోసం ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ అనుమతి రాలేదని తెలుస్తోంది. గన్‌పార్క్ దగ్గర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కంచెలు నాటిందని పలువురు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడూ గన్‌పార్క్ చుట్టూ కంచెలు చూడలేదన్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ సర్కార్.. ఈ అంశాన్ని ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.