Telugu Global
Telangana

చాంద్రాయణగుట్ట నుంచి తండ్రీకొడుకుల నామినేషన్.. కారణం ఇదేనా..?

చాంద్రాయణగుట్ట నుంచి తండ్రీకొడుకులు ఒకే పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

చాంద్రాయణగుట్ట నుంచి తండ్రీకొడుకుల నామినేషన్.. కారణం ఇదేనా..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు రేపు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు వరుసబెట్టి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయన కుమారుడు నూరుద్దీన్ ఓవైసీ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే చాంద్రాయణగుట్ట నుంచి తండ్రీకొడుకులు ఒకే పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నామినేషన్లు వేసిన తర్వాత సరైన ఫార్మాట్లో లేవంటూ ఒక్కొక్కసారి నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎన్నికలకు ఐదేళ్లపాటు దూరం కావాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదనే అక్బరుద్దీన్ ఓవైసీ తనతోపాటు తన కుమారుడి చేత ఎంఐఎం తరఫున నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది.



ఒకవేళ ఏదైనా కారణాల వల్ల నామినేషన్ పత్రాలు తిరస్కరించబడితే బ్యాకప్ నామినీ ఉంటుందని నూరుద్దీన్ ఓవైసీతో కూడా నామినేషన్ వేయించినట్లు సమాచారం. నూరుద్దీన్ ఓవైసీపై ఎలాంటి కేసులు లేవని, బంజారాహిల్స్ లో రూ. 1.25 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.77 లక్షల విలువచేసే ఇల్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాగా, చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

First Published:  9 Nov 2023 10:57 AM GMT
Next Story