Telugu Global
Telangana

కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ లో చేరిన మహారాష్ట్ర రైతు నేతలు

ఇప్పుడు తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేసీఆర్ వెల్లడించారు. హిమాలయాలకన్నా ఉన్నతమైన సంకల్పం తమకు ఉందని, అందుకే ఎండాకాలంలోనూ ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయని అన్నారు.

కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ లో చేరిన మహారాష్ట్ర రైతు నేతలు
X

భారత రాష్ట్ర సమితి అధ్య‌క్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు నాయకులు బీఆరెస్ లో చేరారు. ఈ రోజు మధ్యాహ్నం మహారాష్ట్ర నుంచి భారీ వాహన కాన్వాయ్‎తో మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ తో పాటు వందలాది మంది తెలంగాణ భవన్‎కు వచ్చారు.ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులను కెసిఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ,

ఒకప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉండేదని , ప్రతి రోజూ ఐదారుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేవారని కేసీఆర్ అన్నారు. వాళ్ల పరిస్థితి తలుచుకుని తాను అనేక సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలన్నీ తీరిపోయాయని కెసిఆర్ చెప్పారు.

ఇప్పుడు తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. హిమాలయాలకన్నా ఉన్నతమైన సంకల్పం తమకు ఉందని, అందుకే ఎండాకాలంలోనూ ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ కిసాన్ స‌మితి జాతీయ అధ్య‌క్షుడు గుర్నామ్ సింగ్ చ‌డునీ, మ‌హారాష్ట్ర కిసాన్ స‌మితి అధ్య‌క్షుడు మాణిక్ క‌దం, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

First Published:  1 April 2023 3:44 PM IST
Next Story