Telugu Global
Telangana

సంక్రాంతి తర్వాత రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు

సంక్రాంతి తర్వాత రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి
X

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభ వార్త చెప్పారు. రైతుభరోసా రైతుబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ తరువాత పథకం నిధులు రైతుల అకౌంట్ లో జమ చేస్తామని ప్రకటించారు. విధి, విధానాలను రాబోయే శాసన సభ సమావేశాలలో నిర్ణయిస్తామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చేప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం రేవంత్ కోరారు. ఈ ఏడాది కాలంలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే ఒక రికార్డు అని చెప్పారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ గులామని విమర్శించారు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై చర్చిద్దాం రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

రాష్ట్రంపై రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. ప్రతినెలా రూ. 6500 కోట్లు వడ్డీకే కట్టాల్సి వస్తోందని అన్నారు. తెలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాదిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం వడ్డించేలా ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా పై చర్చిస్తామని తెలిపారు.మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుంది. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశామని తెలిపారు. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఇచ్చి చూపించాం. అలాగే రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామని ముఖ్యమంత్రి తెలిపారు.

First Published:  1 Dec 2024 5:22 PM IST
Next Story