Telugu Global
Telangana

మండీ బిర్యానీ ఎఫెక్ట్.. రెస్టారెంట్ టు హాస్పిటల్

ఓ కుటుంబం పెళ్లిరోజు సెలబ్రేషన్స్ కి మండీ హోటల్ కి వెళ్లింది. మండీ బిర్యానీ తిన్న 8 మంది ఇంటికొచ్చి వాంతులు, విరేచనాలతో మంచం పట్టారు, వెంటనే ఆస్పత్రిలో చేరారు.

మండీ బిర్యానీ ఎఫెక్ట్.. రెస్టారెంట్ టు హాస్పిటల్
X

హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నారని, కుళ్లిపోయిన పదార్థాలు వాడుతున్నారని, కల్తీ నూనెలు, చీప్ క్వాలిటీ పదార్థాలతో వంటలు వండుతున్నారని.. ఇటీవల హైదరాబాద్ లో పలుచోట్ల దాడులు జరిగాయి. కొన్ని హోటళ్లను తాత్కాలికంగా సీజ్ చేశారు, మరికొన్నిటికి ఫైన్ వేశారు. ఇంత జరిగినా ఎవరూ హోటళ్లకు వెళ్లడం మానలేదు. ఫలానా హోటల్ లో భోజనం బాగోలేదు అని తెలిసినా కూడా మళ్లీ అక్కడికే వెళ్తుంటారు. తాజాగా ఓ కుటుంబం పెళ్లిరోజు సెలబ్రేషన్స్ కి మండీ హోటల్ కి వెళ్లింది. మండీ బిర్యానీ తిన్న 8 మంది ఇంటికొచ్చి వాంతులు, విరేచనాలతో మంచం పట్టారు, వెంటనే ఆస్పత్రిలో చేరారు.

తిడతారు, అయినా తింటారు..

హోటళ్లలో కల్తీ జరుగుతుంటే ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఏం చేస్తున్నారంటూ ఇటీవల కొందరు నెటిజన్లు లాజిక్ తీస్తున్నారు. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఏం చేస్తారు..? మహా అయితే నిబంధనల ప్రకారం ఫైన్ వేస్తారు, లేదా హోటల్ మూసేస్తారు. మరో పేరుతో అక్కడ మళ్లీ హోటల్ ప్రారంభమవుతుంది. ఇంకాస్త పెద్దగా పబ్లిసిటీ చేస్తారు, ఇంకే ముంది జనం ఎగబడతారు. ఇక్కడ మార్పు రావాల్సింది ఎవరిలో..? ఫుడ్ ఇన్ స్పెక్టర్లు సరిగా డ్యూటీ చేస్తే జరిగేది ఏంటి..? హోటల్ తిండి విషయంలో జనంలో మార్పు వస్తే ఏం జరుగుతుంది..? అనే చర్చ మొదలైంది.

బిర్యానీ రేటు వెయ్యి.. ఆస్పత్రి ఖర్చు లక్ష

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పెళ్లి రోజు పార్టీ చేసుకున్న కుటుంబం వెయ్యి రూపాయలున్న మండీ బిర్యానీ ఆర్డర్ చేసింది. ఇంటికొచ్చాక 8మంది అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రిలో చేరితో లక్ష రూపాయలు ఖర్చు అయింది. అనారోగ్యంతో పడిన ఇబ్బంది బాధ వారికి అదనం. అంత మాత్రాన సదరు కుటుంబం మరోసారి హోటల్ కి, రెస్టారెంట్లకు వెళ్లదు అనుకోవడం పొరపాటే. ఇలాంటి ఉదాహరణలు పక్కనవారికి జరిగినా, ప్రత్యక్షంగా మనకే జరిగినా.. తగ్గేది లేదంటున్నారు చాలామంది. అందుకే ఓవైపు దాడులు జరుగుతున్నా మరోవైపు రెస్టారెంట్లు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి.

First Published:  28 May 2024 8:37 AM GMT
Next Story