పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. కాంగ్రెస్ దే పాపం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
BY Naveen Kamera3 Oct 2024 6:04 PM IST
X
Naveen Kamera Updated On: 3 Oct 2024 6:04 PM IST
పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ప్రతి నెల రూ.2 వేల కోట్లు తగ్గిపోతుందని గురువారం పత్రికల్లో వచ్చిన వార్తలను 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. పాలకుల అనుభవ రాహిత్యంతోనే ఈ అనర్థం తలెత్తిందని.. సంపద సృష్టించి పేదలకు పంచే తెలివి ముఖ్యమంత్రికి లేకపోవడమే అసలు సమస్య అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఈ దుస్థితి తలెత్తితే వచ్చే నాలుగేళ్లు కష్టకాలమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప ప్రభుత్వం నుంచి దిద్దుబాటు చర్యలు కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన పాపం - మార్పు మార్పు అంటూ కాంగ్రెస్ చేసిన మోసం ఇది అని మండిపడ్డారు.
Next Story